RX 100 కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ అజయ్ భూపతి

RX 100 అప్పటిలో ఈ మూవీ ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసినదే , అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజపుత్ జంటగా చిన్న సినిమాగా విడుదల అయి సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా తరవాత ఈ మూగ్గురు బిజీ బిజీ గా ఉన్నారు.

ఈ సినిమా రిలీజ్ అయి రెండుఏళ్లు అవుతుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడుతూ ‘RX 100’ సీక్వెల్ కు సంబంధించిన ఫ్లాట్ రెడీగా ఉందని అభిమానులతో తెలిపారు. ప్రస్తుతం అజయ్ భూపతి శర్వానంద్ తో మహాసముద్రం అనే మూవీ తెరకెక్కించబోతున్నాడు. నిజానికి ఈ మూవీని మొదట రవితేజ తో అనుకున్నారు , తరువాత నాగ చైతన్య పేరుకూడా వినపడింది. చివరికి ఈ మూవీ ని శర్వానంద్ తో చేస్తున్నారు.

RX 100 హీరో కార్తికేయకు సీక్వెల్ ప్లాట్ సూట్ అవుతుంది అని అజయ్ గట్టి నమ్మకంతో వున్నారు అని తెలుస్తుంది. కార్తికేయ కూడా పలు సినిమాలో బిజీగా ఉన్నాడు. అజయ్ మాటలని బట్టి హీరో కార్తికేయ అని చేపినటే మరి హీరోయిన్ గా పాయల్ ని తీసుకుంటారా లేక వేరే హీరోయిన్ వైపు మొగ్గు చూపుతారా అని వేచి చూడాల్సిందే ….